Home   »  ఉద్యోగం   »   నల్గొండలో మెగా జాబ్‌ మేళా ప్రకటించిన కోమటిరెడ్డి..!

నల్గొండలో మెగా జాబ్‌ మేళా ప్రకటించిన కోమటిరెడ్డి..!

schedule raju

Mega Job Mela in Nalgonda | నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో ఫిబ్రవరి 26న ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.

Komatireddy announced Mega Job Mela in Nalgonda

నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో ఫిబ్రవరి 26న ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (Mega Job Mela in Nalgonda)ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ యువతకు పిలుపునిచ్చారు.

Mega Job Mela in Nalgonda పోస్టర్ విడుదల

సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్ (TASK) మరియు తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (TFMC) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండలో ప్రతి యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మెగా జాబ్‌ మేళా కోసం, మేము ప్రతిరోజూ వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. నిజమైన సంస్థలు మరియు ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తున్నాము. అందుకే జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.

నల్గొండలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్

రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్న నల్గొండ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ప్రతి సెషన్‌లో పది వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని కోమటిరెడ్డి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ CEO గోనారెడ్డి, టాస్క్‌ CEO శ్రీకాంత్‌ సిన్హా, CFMC CEO సత్యనారాయణ, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన సందేహాల కోసం, ఆసక్తి ఉన్న యువత TASK యొక్క ప్రదీప్ రెడ్డిని సెల్ నంబర్ 9618880930లో సంప్రదించాలని తెలిపారు.

Also Read: రేపు విజయవాడలో మెగా జాబ్ మేళా..!