Home   »  ఉద్యోగం   »   మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..!

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..!

schedule raju
Mega DSC notification released

Mega DSC notification | తెలంగాణలో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 11,062 టీచర్‌ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. వీటిలో SGT 6,508, స్కూల్‌ అసిస్టెంట్ 2,629, LP 727, PET 182 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కేటగిరీలో 220 SA, 796 SGT పోస్టులున్నాయి. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని TSPSC స్పష్టం చేసింది.

ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET (Teacher Eligibility Test)లో ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు DSC ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Also Read: బి.కొత్తకోటలో మెగా జాబ్ మేళా..!