Home   »  ఉద్యోగం   »   నేను కలలు కన్న ప్రభుత్వ పాఠశాల….!

నేను కలలు కన్న ప్రభుత్వ పాఠశాల….!

schedule sirisha

సిద్దిపేటలో ప్రభుత్వ బాలికల సమీకృత కళాశాల నూతన భవనాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు ప్రారంభించారు. KCR ఆశయ సాధనలో భాగంగా నేను కలలు కన్న ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే కూలిపోయిన గోడలు, పెచ్చులూడిన బోర్డులు, విరిగిన కుర్చీలు, కానీ మన రాష్ట్రంలో సీఎం KCR ఆలోచనతో ప్రారంభించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల, కళాశాల, కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం అసూయ పడేలా సిద్దమైంది అని హర్షం వ్యక్తం చేశారు.