Home   »  ఉద్యోగం   »   TS Mset కోసం ఒరిజినల్ ID తప్పనిసరి!

TS Mset కోసం ఒరిజినల్ ID తప్పనిసరి!

schedule chiranjeevi

హైదరాబాద్: ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే టీఎస్ ఎంసెట్ పరీక్షలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు చూపితేనే అనుమతిస్తామని ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో-కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ఒరిజినల్ కార్డు తీసుకురావాలని సూచించారు. జిరాక్స్‌, స్కాన్‌ కాపీ చూపిస్తే అనుమతించబోమన్నారు. వ్యవసాయ, వైద్య విభాగాలకు ఈ నెల 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ విద్యార్థులకు 12, 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు జేఎన్‌టీయూ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం రాష్ట్రంలో తొలిసారిగా 132 మంది పరిశీలకులను నియమించారు. ఒక్క హైదరాబాద్ లోనే 84 మంది పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతిస్తారు.