Home   »  ఉద్యోగం   »   RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

schedule sirisha

RBI Assistant Prelims Results | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను బ్యాంక్ వెబ్‌సైట్ chances.rbi.org.in లో చూసుకోవచ్చు.

RBI Assistant Prelims Results

RBI Assistant Prelims Results | RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

నవంబర్ 18, 19 తేదీల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఈ పరీక్షను నిర్వహించింది. RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి తనిఖీ చేసుకోవచ్చు.

ఫలితాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. ఫలితాలలో అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్షా సెంటర్, పరీక్షా తేదీ మరియు స్కోర్ వంటి వివరాలు ఉంటాయి.

RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాల తనిఖీ విధానం

  • బ్యాంక్ వెబ్‌సైట్‌ని లాగిన్ చేయాలి.
  • ప్రస్తుత ఓపెనింగ్‌ల క్రింద ఇవ్వబడిన ఫలితాల ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు, అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం లింక్‌ని క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • సమర్పించి, ఫలితాన్ని చూసుకోవచ్చు.

RBI 100 మార్కులకు అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రిలిమ్స్ పరీక్షలో, అభ్యర్థులను ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ ఎబిలిటీపై మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడిగారు. పేపర్‌లోని మొదటి సెక్షన్‌లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, మిగతా రెండింటిలో 35 మార్కులకు 35 ప్రశ్నలు వచ్చాయి.

Also read: ICAI CA ఫౌండేషన్ పరీక్ష అడ్మిట్ కార్డ్ 2023 విడుదల