Home   »  ఉద్యోగం   »   డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

schedule sirisha

మహబూబాబాదు జిల్లాకు చెందిన మరిపెడ మండలంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలో B.COM, MPCS, BZC కోర్సులలో సీట్లు ఖాళీలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే వేణుగోపాలరావు శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్టీ విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన ఎస్టీ విద్యార్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తో కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. ఇతర వివరాలకు 9885382559 నెంబర్‌ కు సంప్రదించాలని తెలిపారు.