Home   »  ఉద్యోగం   »   TS DSC నోటిఫికేషన్ త్వరలో విడుదల : రేవంత్ రెడ్డి

TS DSC నోటిఫికేషన్ త్వరలో విడుదల : రేవంత్ రెడ్డి

schedule sirisha
CM Revanth Reddy

TS DSC notification : తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మన్ననలు పొంది రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలుసు. అతి త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC notification) వేసేలా చర్యలు తీసుకోనున్నట్లు కొత్త ప్రభుత్వం వెల్లడించింది.

ఎన్నికల ప్రచారంలో TS DSC notification ప్రస్తావన

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీని పేర్కొన్నారు. దీంతో ఈ నోటిఫికేష‌న్ కోసం D.S.C అభ్య‌ర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర D.Ed, B.E.d అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా D.S.C సాధన పేరిట హైదరాబాద్‌ దిల్‍సుఖ్‍ నగర్‌లో డిసెంబ‌ర్ 13వ తేదీన‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొ. కోదండరాం పాల్గొని పలు కీలక విషయాలు ప్రసంగించారు. గ‌త ప్ర‌భుత్వం పదేళ్ల పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని ప్రస్తావించారు.