Home   »  ఉద్యోగం   »   తెలంగాణ గురుకుల పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధం

తెలంగాణ గురుకుల పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధం

schedule sirisha

Gurukulam | తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఫలితాలు త్వరలో విడుదలకు సిద్ధం చేయనున్నారు.

Telangana Gurukulam exam results ready for release

గురుకులా (Gurukulam) ల్లో 9,210 పోస్టుల భర్తీ…

తెలంగాణలోని BC, SC, ST సంక్షేమ గురుకులాల్లో (Gurukulam) 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) ఏర్పాట్లు చేస్తోంది. అనే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు స్పష్టత రాగానే అభ్యర్థుల మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటిస్తారు.

ఆ తర్వాత వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన నుండి అపాయింట్‌మెంట్ పత్రాల జారీ వరకు మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. TREIRB బోర్డు ఈ విద్యా సంవత్సరంలోనే రిక్రూట్‌మెంట్‌లను పూర్తి చేసి పోస్టింగ్‌లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గురుకుల పోస్టులకు సంబంధించిన ఖాళీల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు కూడా తన మద్దతు తెలిపింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టత ఇవ్వాలని, ఫలితాల ప్రచురణను అనుమతించాలని బోర్డు హైకోర్టును కోరింది.

గురుకుల పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు స్పష్టత రాగానే ముందుగా డిగ్రీ లెక్చరర్లు (DL), ఆ తర్వాత జూనియర్ లెక్చరర్స్ (JL), పీజీటీ (PGT) పోస్టుల ఫలితాలను ప్రకటిస్తారు. TREIRB పరీక్షకు హాజరైన అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాను ప్రకటిస్తుంది. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ విధానాన్ని అమలు చేస్తారు.

Also read: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు జనవరి 3 వరకు పొడిగింపు