Home   »  ఉద్యోగం   »   UPSC Recruitment 2024 | 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపటితో లాస్ట్..!

UPSC Recruitment 2024 | 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపటితో లాస్ట్..!

schedule raju
UPSC Recruitment 2024 will end tomorrow

UPSC Recruitment 2024 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. BSc నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు upsconline.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Recruitment 2024 పోస్టులు

  • పర్సనల్ అసిస్టెంట్స్ (PA) – 323
  • ESIC నర్సింగ్ ఆఫీసర్ (NO) – 1930

వయోపరిమితి

కనిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు రూ. 25/- మాత్రమే రుసుము చెల్లించాలి. SBI యొక్క ఏదైనా బ్రాంచిలో నగదు ద్వారా లేదా ఏదైనా బ్యాంకు యొక్క నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా లేదా వీసా/ మాస్టర్/ రూపే/ క్రెడిట్/ డెబిట్ కార్డ్/ UPI చెల్లింపును ఉపయోగించడం ద్వారా కూడా రుసుము చెల్లించవచ్చు. అయితే, SC/ ST/వికలాంగ అభ్యర్థులు/స్త్రీలు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

దరఖాస్తు లింక్: https://upsconline.nic.in/upsc/OTRP/index.php

Also Read: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి జూన్ లో నోటిఫికేషన్?