Home   »  జీవన శైలి   »   కొత్త సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు… ఎప్పుడంటే…

కొత్త సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు… ఎప్పుడంటే…

schedule sirisha

Eclipses | మరో రెండు రోజుల్లో 2023కు ముగింపు పలికి కొత్త ఏడాది 2024లోకి మనం అందరం అడుగు పెడుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఏర్పడనున్నాయి.

2 lunar eclipses in the new year

Eclipses | 2024లో 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు

Eclipses | నిజానికి భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్య గ్రహణం, చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుందని శాత్రవేత్తలు చెపుతారు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం రాహువు సూర్యుడిని కొంత సమయం పాటు మింగి వదిలేస్తాడని, అందుకే భూమిపై సూర్య కిరణాలు పడవు ఆ సమయాన్ని సూర్యగ్రహణం అని, రాహువు చంద్రుడిని కొంత సమయం పాటు మింగి వదిలేస్తాడని. ఆ సమయాన్ని చంద్ర గ్రహణం అని అంటారు.

ఇదంతా సూర్యుడికి, చంద్రుడికి ఉన్న శాపం వల్ల జరుగుతున్నాయని పూర్వకాలం లో ఋషులు, మునులు, మహర్షులు శాస్త్రాలలో రాశారు. అందుకే గ్రహణాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సమయంలో శుభ కార్యాలను ప్రారంభించరు. గర్భిణులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గుడిలో పూజలు చేయరు.

మొదటి చంద్రగ్రహణం

ఈ నూతన సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 25న(సోమవారం) మొదటి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఉదయం 10.41 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయం దాదాపు 4 గంటల పాటు ఉంటుంది. అదే రోజు హోళీ పండుగ, అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు.

ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనిపించనుంది. సూతక్ కాలం ( సూతక్ కాలం అనేది చంద్ర గ్రహణానికి ముందు తొమ్మిది గంటల వ్యవధి, ఇది సాంప్రదాయ విశ్వాసాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.) పాటించాల్సిన అవసరం లేదు.

రెండవ చంద్రగ్రహణం

రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడుతుంది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. యూరోపియన్, ఉత్తర, దక్షిణ అమెరికా, దక్షిణ, ఉత్తర ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది. సూతక్ కాలం పాటించాల్సిన అవసరం లేదు. రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు భారత్ పై ప్రభావం చూపవు.

మొదటి సూర్యగ్రహణం

2024 లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 8 న ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 1.25 గంటలకు ముగియనుంది. ఇది భారతదేశంలో కనిపించదు. మొట్టమొదటి సూర్య గ్రహణం పశ్చిమ ఆసియా, నైరుతి ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాలలో కనిపించనుంది.

రెండవ సూర్యగ్రహణం

రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2 న రాత్రి 9.13 గంటలకు సూర్య గ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3.17 వరకు ముగుస్తుంది. ఇది కూడా భారతదేశంలో కూడా కనిపించదు. సుతాక్ కాలంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి హిందువులపై ప్రభావం ఉండకపోవచ్చు. అమెరికన్, దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో మాత్రమే కనిపించనున్నాయి. కాబట్టి 2024 లో రెండు గ్రహణాలు సంభవిస్తున్నప్పటికీ భారతదేశంలో కనిపించనందున దాని ప్రభావం ఉండదని నిపుణులు చెప్తున్నారు.

Also read: రోజూ 4 వాల్‌నట్స్‌ తింటే.. ఎన్నో ప్రయోజనాలు..