Home   »  జీవన శైలి   »   రాష్ట్రంలో కనిపించని వరుణుడి జాడ..?

రాష్ట్రంలో కనిపించని వరుణుడి జాడ..?

schedule sirisha

తెలంగాణ: రాష్ట్రంలో రుతుప‌వానాలు ఆల‌స్యంగా ప్రారంభమయ్యాయి. జులై నెలలో చాలా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో కురిసింది. అంతే ఇంకా మల్లి ఆ వరుణుడు వచ్చింది లేదు పంటలు పండేది లేదు అని ప్రజలు వాపోతున్నారు. ఆగస్టు నెలలో రాష్ట్రం అంతటా ఈ సారి అత్యల్పంగా 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితి 1972లో కూడా ఏర్పడింది.

క‌నీసం సెప్టెంబ‌ర్ లోనైనా వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఆశ‌ప‌డుతున్న రైతుల‌కు వాతావ‌ర‌ణ శాఖ చేదు క‌బురే చెప్పింది. ఆక్టోబ‌ర్ లో వ‌ర్షాలు కుర‌వ‌వ‌చ్చ‌ని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రైతులు వర్షాలు లేక పంటలు ఏం అవుతాయో అని బాధని వ్యక్తం చేస్తున్నారు.