Home   »  జీవన శైలి   »   NEET | మరొక NEET విద్యార్థి ఆత్మహత్య!

NEET | మరొక NEET విద్యార్థి ఆత్మహత్య!

schedule sirisha

రాజస్థాన్‌లోని కోటాలో NEET పరీక్షకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ చోటు చేసుకుంది. దీంతో ఈ ఏడాది మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25కి చేరుకుంది. చివరి సంవత్సరం 15 మంది విద్యార్థులు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు.

neet-|-another-neet-student-commits-suicide

మృతురాలు ఉత్తరప్రదేశ్‌ నివాసి ప్రియాం సింగ్ గా గుర్తించారు. సంవత్సరం క్రితం మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి కోటాకు వచ్చింది. ఆమె దకానియా రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఆ రూమ్ లో ఒక్కతే ఉంటు NEET పరీక్షా కోసం కోచింగ్ తీసుకుంటుంది.

ప్రియాం సోమవారం ఉదయం కోచింగ్ సెంటర్‌కు వెళ్లిందని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కౌసల్య పేర్కొన్నారు. కాగా మధ్యాహ్నం 3 గంటల కు తన అపార్ట్మెంట్ కు తిరిగి వస్తుండగా అనుకోకుండా ఆమెకు వాంతులు మొదలవడం తో కొంతమంది విద్యార్థులు కోచింగ్ సిబ్బందికి సమాచారం అందించారు.

వారు ఆమెను తల్వాండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆమె పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం 6.45 గంటలకు మరణించింది.

NEET విద్యార్థి ఆత్మహత్య గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :-

కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె విషం తాగింది. పోలీసులు ప్రియాం కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆమె గదిని పరిశీలించనున్నారు.

కోటాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్ని పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రియాం సింగ్ ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా ప్రభుత్వ కీలక నిరయం ప్రకారం కోటా హాస్టల్ మేనేజ్‌మెంట్ అన్ని హాస్టళ్ల గదుల్లో “ఆత్మహత్య-ప్రూఫ్”గా చేయడానికి “స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్‌” ల ను అమర్చారు.

అందుకే ప్రియాం సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.