Home   »  జీవన శైలి   »   ఇంగువ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారని మీకు తెలుసా…?

ఇంగువ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారని మీకు తెలుసా…?

schedule sirisha

Weight loss | చెట్టు వేర్ల నుండి వచ్చే ఇంగువ మానవ శరీరంలో జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయ పడుతుంది. ఎంజైమ్‌ల కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇంగువ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Weight loss | Did you know that drinking amaranth water can help you lose weight

Weight loss కు ఇంగువ నీళ్లు

ఇంగువ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో ఇంగువ నీరు సహాయం చేస్తాయి. అజీర్ణం, కడుపులో మంట, అన్నం సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియ ప్రక్రియలను మెరుగు పరచడంలో ఇంగువ సహాయ పడుతుంది. రోజూ ఇంగువ నీటిని తాగితే జీవక్రియ మెరుగుపడి శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది.

ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియ వ్యాధులు మరియు ఊబకాయంతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం, ఇంగువ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అధిక కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

ఇంగువ నీళ్లు తయారీ విధానం

ఇంగువ నీటిని సిద్ధం చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు నీటిని ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ వేయాలి. కాసేపు అలా చిన్న మంట మీద ఉంచాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. కావాలంటే నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు. అదికూడా నీరు గోరువెచ్చగా అయ్యాక మాత్రమే కలుపుకోవాలి.

గమనిక: మేము ప్రచురించే విషయం ఇంగువ పదార్థం గురించి కాగా ఇది కేవలం ప్రజల అవగాహన కొరకు మాత్రమే, ప్రయోగాలు చేసినవి కావు.

Also read: నగరాన్ని వణికిస్తున్న సీజనల్‌ వ్యాధులు…