Home   »  జీవన శైలి   »   Holi | హోళీ వేడుకల్లో ఏ రంగులు వాడబోతున్నారు?

Holi | హోళీ వేడుకల్లో ఏ రంగులు వాడబోతున్నారు?

schedule ranjith
Holi 2024 | What colors are going to be used in Holi celebrations?

Holi | హోళీ పండుగ ఆనందం నింపాలేగానీ విషాదం మిగల్చకూడదు. ఇలా జరగొద్దంటే సింథటిక్ రంగులను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగుల తయారీలో రాగి, సిలికా, సీసం, ఆర్సెనిక్ వంటి అనేక విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు. అలాగే మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి కొన్ని పదార్థాలను కూడా రంగుల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

హోళీ సింథటిక్ రంగుల కారణంగా చర్మం, కళ్ళు, శ్వాసనాళాలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ కలర్స్ వల్ల నేత్రాలకు ఎక్కువ గాయాలు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదమూ ఉందంటున్నారు నిపుణులు. 2020లో నిర్వహించిన “Clinical profile of eye injuries due to Holi colours” అనే అధ్యయనం ప్రకారం, సింథటిక్ రంగులు కంటిలోకి పోయిన కారణంగా ముగ్గురు వ్యక్తులు దృష్టి కోల్పోయారని తేలింది.

Holi | హోళీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి:-

  • ముఖం మీద నేరుగా రంగులు చల్లడం చేయకూడదు. దీనివల్ల కంట్లోకి పోయి ఛాన్స్ ఉంటుంది.
  • కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
  • కంటిలో రంగు పడితే వెంటనే చేతులు కడుక్కొని, స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని అందులో కళ్లను ముంచి సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
  • కంట్లోకి నీళ్లు కొట్టడం, కర్చీఫ్, టిష్యూ ఉపయోగించి కంటిలో చిక్కుకున్న నలుసు తొలగించే ప్రయత్నం కూడా చేయకూడదంటున్నారు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
  • కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య అలాగే ఉంటే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యుల సూచనలు లేకుండా ఐడ్రాప్స్‌ (Eye Drops) వంటివి ఏవీ వాడకూడదని చెబుతున్నారు.
  • హోళీ ఆడిన తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే తగిన వైద్య సంరక్షణ అవసరమని సూచిస్తున్నారు.
  • సింథటిక్ హోళీ రంగుల వల్ల శ్వాస సంబంధిత సమస్య వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read | హోళీ సందర్బంగా ప్రత్యేక రైళ్లను నడపనున్న SCR.!