Home   »  జీవన శైలి   »   డిన్నర్‌లో వీటిని తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం..

డిన్నర్‌లో వీటిని తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం..

schedule mounika

రాత్రి తీసుకునే ఆహారం (dinner) లో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి నిద్రలేమి సమస్య వస్తుంది. కావున మనం రాత్రి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

dinner | రాత్రి పూట పండ్లు తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం పెరుగుదల..

రాత్రి పూట పండ్లు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. పండ్లు ఉదయం, మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోవాలి. రాత్రి పూట పండ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నిద్రపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

రాత్రి పూట హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్‌ తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం పెరుగుదల..

రాత్రి పూట ఇడ్లీ, దోశ, నూడుల్స్, పాస్తా, మొదలైన ప్రాసెస్డ్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్‌ని తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది. డిన్నర్‌లో వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయలేరు.

చాల మంది రాత్రి డిన్నర్‌ని లేటుగా చేస్తుంటారు. ఇది చాలా తప్పు. తిన్న వెంటనే పడుకోకూడదు. మనం రాత్రి డిన్నర్ చేయడానికి, పడుకోవడానికి కనీసం 3 గంటల గ్యాప్ అయినా ఉండాలి. కాబట్టి, రాత్రి భోజనం 7 గంటల్లోపే తినడం ఆరోగ్యానికి మంచిది.

ALSO READ: మొలకెత్తిన శనగలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..