Home   »  జీవన శైలి   »   గ్రీన్‌ బీన్స్‌ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

గ్రీన్‌ బీన్స్‌ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

schedule mounika

Green Beans Health Benefits | గ్రీన్‌ బీన్స్‌.. వీటిని స్ట్రింగ్ బీన్స్‌ అని కూడా పిలుస్తుంటారు. వీటిలో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్‌ A, C, K, ఫోలిక్‌ యాసిడ్, మాంగనీస్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రీన్‍ బీన్స్‌ తరచు మన డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. .​

Green Beans Health Benefits | గ్రీన్‌ బీన్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

గ్రీన్ బీన్స్‌లో ఫ్లేవనాయిడ్‌లు, కెరోటినాయిడ్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి తోడ్పడతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడానికి దోహద పడుతుందని నిపుణులు అంటున్నారు.

గ్రీన్‌ బీన్స్‌లో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌ కంటెంట్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి, హృదయనాళ పనితీరును ప్రోత్సహిస్తాయి. తద్వారా.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు.

ఎముకలను బలంగా ఉండటానికి గ్రీన్‌ బీన్స్ యొక్క పాత్ర..

గ్రీన్‌ బీన్స్‌లో విటమిన్‌ K, మాంగనీస్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఈ పోషకాలు.. ఎముక ఖనిజీకరణ, సాంద్రతకు దోహదం చేస్తాయని, మన డైట్‌లో తరచు గ్రీన్‌ బీన్స్‌ చేర్చుకుంటే.. బోలు ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి గ్రీన్‌ బీన్స్ యొక్క పాత్ర..

గ్రీన్ బీన్స్‌లోని ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ శోషణను మందగించి.. బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి తోడ్పడతాయి. డయాబెటిస్‌ ఉన్నవారు, ప్రీ డయాబెటిస్‌ స్టోజ్‌లో ఉన్నవారు గ్రీన్‌ బీన్స్‌ వారి డైట్‌లో చేర్చుకుంటే.. మేలు జరుగుతుంది. గ్రీన్ బీన్స్‌లోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తాయని నిపుణులు అంటున్నారు.

ALSO READ: డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు