Home   »  జీవన శైలి   »   నల్లద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

నల్లద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

schedule mounika

Black Grapes Benefits | నల్లద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ నల్లద్రాక్షలో ఉంటాయి. నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Black Grapes Benefits | నల్లద్రాక్ష లో ఉండే పోషకాలు..

నల్లద్రాక్షలో ఎక్కువగా విటమిన్ “C” ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. అదేవిధంగా నల్లద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం విటమిన్లు A, B6, ఫోలిక్ యాసిడ్స్, సిట్రస్ యాసిడ్స్, గ్లూకోజ్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

నల్లద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు..

నల్లద్రాక్షలో ఎక్కువగా ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంత వరకూ క్యాన్సర్ తగ్గుతుంది. కాబట్టి, నల్లద్రాక్ష తినడం ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా, నల్లద్రాక్షలో ఉండే ముఖ్యమైన పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాదు నల్ల ద్రాక్షను రోజూ తినడంవల్ల క్యాటరాక్ట్‌ సమస్యను నివారించవచ్చు. 

నల్లద్రాక్షలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది, అజీర్తిని కూడా నివారిస్తుంది. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

ALSO READ: ఎండాకాలం లో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ డ్రింక్స్ తాగండి