Home   »  జీవన శైలి   »    పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

 పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

schedule mounika

watermelon Benefits | చలువ చేసే ఆహార పదార్థాల జాబితాలో మొట్టమొదటిగా ఉండేది పుచ్చకాయ. సమ్మర్ సీజన్‌లో ఎక్కడ చూసిన పుచ్చకాయ కనిపిస్తుంది. సమ్మర్ లో మన శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్, వడదెబ్బ, తలనొప్పి వంటి సమస్యలు చాలా వేధిస్తాయి. ఈ సీజన్ లో పుచ్చకాయ తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు

watermelon Benefits | పుచ్చకాయలో ఉండే పోషకాలు..

పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్-A, C, B6, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయను రోజూ తినడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల మీకు తక్కువ కేలరీలు లభిస్తాయి. దీన్ని తినడం వల్ల బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు.

పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలు..

పుచ్చకాయ తినడం వల్ల రోజంతా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలోని విటమిన్ “A” జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ “C” జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

ALSO READ : నల్లద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

.