Home   »  జీవన శైలి   »   చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

schedule sirisha

Health | శీతాకాలంలో చలిగా ఉండటం వల్ల దాహం తక్కువగా వేస్తుంది. దీంతో తక్కువ నీరు తాగుతుంటారు. కానీ, శీతాకాలంలో కూడా శరీరానికి తగినంత నీరు అవసరం. తక్కువ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Health | Are you drinking less water in winter?

Health | తలనొప్పికి కారణం తక్కువ నీరు తాగడం

Health | శరీరంలో నీరు లేకుంటే, మీ శరీరం బలహీనంగా మారుతుంది. మనం తక్కువ నీరు తాగితే అది మన శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే మన శరీరానికి సరైన ఆక్సిజన్ అందదు. చలికాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉత్తమమైన మార్గం అధికంగా నీరు తాగడం.

శరీరానికి సరిపడా నీరు అందకపోతే మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది.శరీరంలో హైడ్రేషన్ స్థాయి తగ్గి తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వాతావరణంతో సంబంధం లేకుండా నీటిని తాగాలి.నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

చలికాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్

చలికాలంలో హైడ్రేట్‌గా ఉండటానికి నీరు మాత్రమే సరిపోదు కాబట్టి రోజువారీ ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది.

డీహైడ్రేషన్ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశాలున్నాయని వైద్యులు అంటున్నారు. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మెదడులో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. దీంతో మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

శీతాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు

  • జీర్ణక్రియ సమస్యలు: తక్కువ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
  • చర్మ సమస్యలు: శరీరానికి తగినంత నీరు లభించకపోతే చర్మం పొడిబారుతుంది, పగుళ్లు వస్తాయి.చర్మం మెరుపును కోల్పోతుంది.
  • మూత్రపిండాల సమస్యలు: తక్కువ నీరు తాగడం వల్ల మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
  • కీళ్ల నొప్పులు: శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కీళ్లకు సరిపోయినంత లూబ్రికేషన్ లభించదు. దీంతో కీళ్ల నొప్పులు, మంట వంటి సమస్యలు వస్తాయి.
  • అలసట : శరీరానికి తగినంత నీరు అందకపోతే రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.

చలికాలంలో ఎంత నీరు తాగాలి?

శీతాకాలంలో రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. అంతేకాకుండా, రోజంతా సమయానుసారంగా చిన్న చిన్న మోతాదుల్లో నీరు తాగుతూ ఉండాలి.

శీతాకాలంలో నీరు తాగడానికి కొన్ని చిట్కాలు

  • తాజా పండ్ల రసాలు, సూప్‌లు తాగాలి.
  • ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్లను తినాలి. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
  • తరచుగా గోరువెచ్చని నీరు తాగాలి.
  • కాఫీ, టీ వంటి పానీయాలను తక్కువగా తాగాలి.

Also rad: దానిమ్మ రసం వల్ల కలిగే లాభాలు తెలిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు