Home   »  జీవన శైలి   »   చర్మ వ్యాధులు పోవాలంటే ఈ జలపాతంలో స్నానం చేయాల్సిందే..!

చర్మ వ్యాధులు పోవాలంటే ఈ జలపాతంలో స్నానం చేయాల్సిందే..!

schedule sirisha

తమిళనాడు | హొగెనక్కల్(Hogenakkal) జలపాతం కావేరీ నది ప్రాంతంలో సహజంగా ఏర్పడింది. ఇది తమిళనాడు (TN) రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఉంది. ఇది బెంగుళూరు నుండి 180 కి.మీ, ధర్మపురి నుండి 46 కి.మీ. దూరంలో ఉంది.

Hogenakkal Falls in Tamil Nadu state

కన్నడలో హోగే అంటే పొగ, కల్ అంటే రాయి, హోగెనక్కల్ (Hogenakkal) అంటే పొగలు చిమ్మే రాయి లేదా మంచు తుంపరల నుండి వచ్చే శబ్దం అని అర్ధం. కార్బొనటైట్ శిలలు దక్షిణ ఆసియాలో మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవిగా పరిగణించబడుతున్నాయి.

జలపాతం ఆకాశం నుంచి దూకుతున్నట్లుంది. వర్షాకాలంలో ఈ జలపాతం అందాలను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. జలపాతం నుండి జాలువారుతున్న నీరు రాళ్లపై పడినప్పుడు నీటి తుంపర్లు పైకి లేస్తాయి. చూడటానికి పొగలా కనిపిస్తుంది.

Hogenakkal జలపాతం ఒక అద్భుతం

నిజానికి ఇక్కడ ఉన్నది జలపాతం కాదు. అనేక జలపాతాలు కలయికతో ఏర్పడిన ఒక అద్భుతం. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుంచి నేలకు దూకుతాయి. వర్షపు నీరు కొండ వాలు నుండి ప్రవహించి హొగెనక్కల్ దగ్గర నదిలో కలుస్థాయి.

ఈ జలపాతాల నీరు కావేరి ఆనకట్ట వెనుక నీరు, ఇంకా కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లోని తలకావేరిలో జన్మించిన కావేరీ నది తూర్పు దిశలో ప్రవహిస్తు కొండ వాలులో ప్రవాహవేగం పెరుగుతుంది. పిల్ల కాలువలతో కలిసి ప్రవహిస్తుంది.

ఈ జలపాతం నుండి నీరు దక్షిణాన స్టాన్లీ రిజర్వాయర్‌లోకి ప్రవహిస్తుంది. దాదాపు 60 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌పై నిర్మించిన ఆనకట్ట ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే పంట పొలాల్లోకి సాగు నీరు చేరుతోంది.

హొగెనక్కల్ నీటిలో ఔషధ గుణాలు

హొగెనక్కల్ జలపాతం ఆరోగ్య పరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఈ ప్రదేశం మసాజ్‌కి ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద తైలాలతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, జబ్బులు తగ్గుతాయని చెబుతారు. ఈ జలపాతం కింద వేలాది మంది స్నానాలు చేస్తుంటారు. అందుకు అనుగుణంగా ఇక్కడ వంతెనలు కూడా ఏర్పాటు చేశారు. ఆయుర్వేద నూనెల తయారీ ఇక్కడి స్థానికులకు కుటీర పరిశ్రమగా ఉంది.

బెంగళూరు నుండి ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. బెంగుళూరుకు విమాన మరియు రైలు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి హొగెనక్కల్ జలపాతం 180 కి.మీ. ఉంటుంది. ఈ ప్రాంతం నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలం నుండి రైలులో హొగెనక్కల్ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో జలపాతానికి వెళ్ళవచ్చు. బెంగళూరు నుండి 4 గంటలు, చెన్నై నుండి 6 గంటలు, సేలం నుండి 2 గంటలు మరియు ధర్మపురి నుండి 1 గంటలో చేరుకోవచ్చు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని తివాచీ పరిచినట్లు మల్బరీ తోటలు దర్శనమిస్తాయి.

జలపాతం చేపలు రుచి చూడాల్సిందే..

హొగెనక్కల్ యాత్రలో చేపలతో చేసే వంటకాలు మరిచిపోలేని రుచినందిస్తాయి. నదిలో చేపలను పట్టుకుని కాల్చి ఇస్తారు. ఇక్కడి అందాలను చూసేందుకు వచ్చే వారిలో చాలా మంది ఈ చేపల రుచిని ఆస్వాదిస్తున్నారు. జలపాతం హోరులో చేపలను ఆరగిస్తుంటే ఆ రుచి మరెక్కడా దొరకదనిపిస్తుంది. అరుదైన ప్రకృతి సంపదను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాలనే భావన కలుగుతుంది.

Also read: ఆంధ్రలో 3 పురాతన దేవాలయాలు కనుగొన్న చరిత్రకారుడు