Home   »  జీవన శైలి   »   ‘ఇండోనేషియా లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత’

‘ఇండోనేషియా లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత’

schedule raju

ఇండోనేషియా లోని బాలి సముద్ర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. అయితే సముద్ర గర్భంలో 500 వందల కిలోమీటర్ల దిగువన కదలికలు సంభవించడంతో సునామీ వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. ఇక 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలసీ (NCS) పేర్కొంది.

బాలి, లోంబోక్ తీర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 6.1, 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.