Home   »  జీవన శైలి   »   Hyderabad rains | నగరంలో అత్యధికంగా వర్షపాతం…

Hyderabad rains | నగరంలో అత్యధికంగా వర్షపాతం…

schedule sirisha

Hyderabad rains: హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కొత్తపేట, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగ్‌, అత్తాపూర్‌, గచ్చిబౌలి, హబ్సీగూడ, కూకట్‌పల్లి, బీరంగూడ, చందనానగర్, కొండాపూర్‌ తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

వర్షం కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు రాగల ఒకటి, రెండుగంటల్లో మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం బల్దియాను ఆశ్రయించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో కురిసింది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి ట్విట్టర్‌ వేదికగా నగరవాసులను అప్రమత్తం చేయడం తో పాటు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు ఉన్నాయని అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంటికే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర సాయం కోసం GHMC కంట్రోల్‌ రూం నం. 040-21111111, 9000113667 ద్వారా DRF బృందాలను ఆశ్రయించాలని కోరారు.

లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన రెస్క్యూ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

అలాగే నగర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ, ఈవీడీఎం బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు.

Hyderabad rains | అత్యధిక వర్షపాతం :-

ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నగరంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.

  • ముషీరాబాద్‌ 4.3సెం.మీ
  • లంగర్‌ హౌజ్‌ 4.3సెం.మీ
  • మధురానగర్‌ 4.0సెం.మీ
  • చందానగర్‌లో 3.8సెం.మీ
  • ఎల్బీనగర్‌ 3.7సెం.మీ
  • సైదాబాద్‌లో 3.7సెం.మీ
  • నాంపల్లిలో 3.6సెం.మీ
  • సికింద్రాబాద్‌ 3.5సెం.మీ
  • చార్మినార్‌ 3.5సెం.మీ
  • షేక్‌పేట్‌ 3.2సెం.మీ
  • చిలుకలగూడ 3.1సెం.మీ

ఆసిఫ్‌ నగర్‌, మోండా మార్కెట్‌, బహదూర్‌పురా, మారేడ్‌పల్లి, ఉప్పల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట్‌ వంటి, కూకట్‌ పల్లి, హిమయత్‌ నగర్‌, పటాన్‌ చెరు, బాలానగర్‌, శేరిలింగంపల్లి లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.