Home   »  జీవన శైలి   »   Cholesterol | కొలెస్ట్రాల్ కరిగిపోవాలి అంటే ..తేనెతో వీటిని కలిపి తీసుకోండి..

Cholesterol | కొలెస్ట్రాల్ కరిగిపోవాలి అంటే ..తేనెతో వీటిని కలిపి తీసుకోండి..

schedule mounika

కొలెస్ట్రాల్ (Cholesterol)పెరిగితే బరువు పెరుగుతారు కావున ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు కావున ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..

Cholesterol | కొలెస్ట్రాల్‌ని తగ్గించడం లో వెల్లుల్లి పాత్ర..

వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తప్రసరణని ఈజీగా చేస్తుంది. వెల్లుల్లిని స్వచ్ఛమైన తేనె లో కలిపి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కొలెస్ట్రాల్‌ని తగ్గించడం లో దాల్చిన చెక్క పాత్ర..

దాల్చిన చెక్క కూడా చక్కని ఔషధం. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడపున తీసుకోండి. అలానే దాల్చిన చెక్కని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగినా కొలెస్ట్రాల్ తగ్గుతంది.

కొలెస్ట్రాల్‌ని తగ్గించడం లో ఉసిరి కాయ పాత్ర..

కొలెస్ట్రాల్‌ (Cholesterol) ని తగ్గించడంలో ఉసిరి కూడా ముందుంటుంది. ఇందుకోసం రోజూ రెండు ఉసిరికాయల్ని తినండి. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు ఉంటే ఉసిరికాయ జ్యూస్ ను తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలి. ఈ జ్యూస్‌లో అర్జుంజెనిన్, అర్జునోలిక్ యాసిడ్, పాలీఫెనాల్ ఉండటం వల్ల గుండె కండరాలు బలపడతాయి. రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆయిలీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి. ఒత్తిడి లేకుండా చూసుకోండి. దీని వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ మన దరి చేరకుండా ఉంటుంది.

ALSO READ: గ్రీన్‌ బీన్స్‌ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..