Home   »  జీవన శైలి   »   మెట్రో-3 డీపీఆర్ టెండర్లకు నేడే ఆఖరు..

మెట్రో-3 డీపీఆర్ టెండర్లకు నేడే ఆఖరు..

schedule mounika

TS: మెట్రో-3 డీపీఆర్ టెండర్లకు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 18న టెండర్లు పిలవగా, 28వ తేదీని చివరి తేదీగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ నిర్ణయించింది. టెండరు గడువు ముగిసిన వెంటనే అర్హత కలిగిన సంస్థ ప్రతిపాదిత మెట్రో మార్గాలకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలను, డీపీఆర్ లను రూపొందించేందుకు సుమారు 2 నెలల గడువు ఇవ్వనున్నారు.

కొత్తగా 12 మార్గాల్లో మొత్తం 278 కిలోమీటర్ల మేర మూడో దశ మెట్రోను నిర్మించేలా కార్యాచరణను హైదరాబాద్ మెట్రో సంస్థ రూపొందించింది. ఇప్పటికే మొదటి దశ మెట్రో 69 కి.మీ అందుబాటులో ఉండగా, రెండోదశను రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మేర నిర్మిస్తున్నారు.