Home   »  జీవన శైలి   »   Nipah Virus Update | కేరళలో పెరుగుతున్న నిఫా వైరస్ కేసులు..

Nipah Virus Update | కేరళలో పెరుగుతున్న నిఫా వైరస్ కేసులు..

schedule sirisha

Nipah Virus Update | నిఫా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కేరళలోని కోజికోడ్‌లో వైరస్‌ కు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Mumbai Fever | In Mumbai, doctors are worried about the virus

సెప్టెంబరు 12న జిల్లాలో ఇద్దరు జ్వర మృతి చెందారని నమోదవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం లోని 39 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ ఉన్నట్లు శుక్రవారం (సెప్టెంబర్ 14) పరీక్షల్లో వెల్లడైంది. అతను ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

నిఫా పాజిటివ్‌ వచ్చిన అతను ఇంతకు ముందు ఇతర వ్యాధులకు సంబంధించిన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేపించుకున్నట్లు తెలిపాడు.

చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజులు పూర్తి రాకపోకలని నిషేధించింది.

తిరువనంతపురంలో వీణా జార్జ్ ఒక ప్రకటన వెల్లడించాడు.

అదేంటంటే సెప్టెంబర్ 24 వరకు కోజికోడ్‌లో ప్రజలు కోవిడ్ సమయంలో పాటించిన నిబంధనల మాదిరిగానే ఆదేశాలు జారీ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను లేక రాసారు.

హై-రిస్క్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మరో 15 మంది వ్యక్తుల నమూనాలను కూడా పరీక్షల కోసం పంపారు. వైరస్ పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది అని తెలిపారు.

పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) తన మొబైల్ BSL-3 (బయోసేఫ్టీ లెవెల్-3) ప్రయోగశాలను జిల్లాలోనే వైరస్ కోసం నమూనాలను పరీక్షించడానికి కోజికోడ్‌ కు నిర్ధారణ కోసం పరీక్షించడానికి కోజికోడ్‌కు తమ మొబైల్ ల్యాబ్ పరికరాలను పంపించింది.

మానవులకు ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను పరీక్షించడానికి ఫిబ్రవరి 2022లో మొబైల్ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు.

ఆర్‌జిసిబి డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రభాస్ నారాయణ మాట్లాడుతూ మొబైల్ యూనిట్‌లో ఆరుగురు నిపుణుల బృందం సేవలను అందించడానికి కేరళ కు పంపామని తెలిపారు.

దీని వల్ల ఆరు గంటల్లో ఫలితాలను మనం తెలుసుకోవచ్చు అని వెల్లడించారు.