Home   »  జీవన శైలి   »   గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా తీసుకోండి..!

గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా తీసుకోండి..!

schedule mounika

Nutrients for Heart Health | మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. రోజూ సరైన వ్యాయామం, విశ్రాంతితోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె పనితీరును ప్రభావితం చేసే, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఏమిటో తెలుసుకుందాం.

Nutrients for Heart Health

Nutrients for Heart Health | మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన వ్యాయామం, విశ్రాంతితోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం పాత్ర..

గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం శరీరంలో మంట, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం కారణంగా బీపీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మీరు హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ డైట్‌లో మెగ్నిషయం అధికంగా ఉండే బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్, సాల్మన్, అవకాడో, అరటిపండ్లు, గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్‌ చాక్లెట్‌, చిక్కుడు, బీన్స్‌, సోయా, అవకాడో పండ్లు, పప్పు దినుసులు మీ ఆహారంలో చేర్చుకోవాలి.

గుండె సక్రమంగా పని చేయడానికి పొటాషియం పాత్ర..

గుండె సక్రమంగా పని చేయడానికి పొటాషియం ఎంతో సహకరిస్తుంది. ఇది శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజ పదార్ధం. రక్తంలోని పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. పొటాషియం కండరాలు, గుండె సంకోచాలను కూడా నియంత్రిస్తుంది. పొటాషియం లోపం కారణంగా గుండె లయ తప్పడం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మీ డైట్‌లో బంగాళదుంపలు, బీన్స్, అరటి, అవకాడో, గుమ్మడికాయ, ఎండలో ఎండబెట్టిన టమోటాలు, పాలు, సాల్మన్ ఫిష్‌ తీసుకోండి.​

Nutrients for Heart Health | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే D-విటమిన్ తీసుకోవాలి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కూడా D-విటమిన్ తగినంత తీసుకోవాలని, విటమిన్-D తక్కువైతే కాల్షియం తక్కువవుతుందని, ఇమ్యూనిటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీని లోపం ఒకవైపు రక్తంలో పీడనాన్నీ, గుండె జబ్బుల రిస్కునూ కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బీపీ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్-D కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్-D రక్తనాళాల విస్తరణను ప్రోత్సహించి, ఎండోథెలియల్ డిస్‌ఫంక్షన్‌ను తగ్గించి వాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తుందని ఓ పరిశోధనలో కనుగొన్నారు. విటమిన్-D లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని, ఇది హృదయనాళ వ్యవస్థలో వాపును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పోలేట్‌, విటమిన్ B-6 ఎక్కువగా తీసుకునే వ్యక్తులు స్ట్రోక్, గుండె వైఫల్యం, గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. విటమిన్-B12, B9, B6 గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. B విటమిన్లు శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయ. ఈ పోషకాలు కణజాలాలు, అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం అని గమనించగలరు.

ALSO READ: రాగుల్లో బెల్లం కలిపి తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం..