Home   »  జీవన శైలి   »   చలికాలంలో ఈ కాయ తింటే డెంగ్యూ దరిచేరదు..!

చలికాలంలో ఈ కాయ తింటే డెంగ్యూ దరిచేరదు..!

schedule sirisha

Raw Papaya Benefits | పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదంలో పచ్చి బొప్పాయిని పోషకాల నిధిగా పరిగణిస్తారు. అయితే బొప్పాయి పండుగా మారకముందే కాయ దశలో ఉన్నప్పుడు అందులో పుష్కలమైన పోషకాలు లభిస్తాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు.

Raw papaya benefits

Raw Papaya Benefits | పచ్చి బొప్పాయి వల్ల ప్రయోజనాలు

Raw Papaya Benefits | చలికాలంలో పచ్చి బొప్పాయి ని తినడం వల్ల మనకు చాలా పోషకాలు అందుతాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచి రోగనిరోధక శక్తి పెరిగేలా సహాయ పడుతుంది. డెంగ్యూ రోగులకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పచ్చి బొప్పాయిని తినడం కోసం ముందుగా ఉడికించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి కాయలో రబ్బరు పాలు (Latex) ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది కొందరికి పడకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీలు తినకపోవడం మంచిదని అంటున్నారు.

పచ్చి బొప్పాయి తినడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి బయటపడొచ్చు. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్-A, విటమిన్-C వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి.

పచ్చి బొప్పాయి కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు దీని రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బొప్పాయి ప్లేట్‌లెట్లను పెంచుతుంది. పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం మరియు అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇంకా పచ్చి బొప్పాయి తినడం వల్ల చికాకు లేదా ఇన్ఫెక్షన్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గొంతు ఇన్ఫెక్షన్లు మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. ఇది ఊపిరితిత్తుల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దరిచేరనివ్వదు. పచ్చి బొప్పాయిలో ప్రోటీజ్ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి.

గమనిక: బొప్పాయిని గర్భిణీలు తినకూడదు. ఈ పండును మితంగా తీసుకోవాలి.

Also read: రోజూ బటర్ తినడం వల్ల బోలెడు లాభాలు..