Home   »  జీవన శైలి   »   TS : రికార్డు స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు

TS : రికార్డు స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు

schedule sirisha

తెలంగాణ: TS ప్రభుత్వాస్పత్రుల్లో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు. జూలైలో అత్యధికంగా 72శాతం డెలివరీలు జరిగినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 30శాతం డెలివరీలు మాత్రమే జరిగాయని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సమయాల్లో వైద్యులను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం సౌకర్యాలు కల్పించడంతో గర్భిణీలు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.