Home   »  జీవన శైలి   »   Viral fever | హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్ల హవా….!

Viral fever | హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్ల హవా….!

schedule sirisha

హైదరాబాద్: నగరంలో గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతుండడంతో నగరంలో వైరల్ ఫీవర్ల (Viral fever) కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సంబంధించిన లక్షణాలతో పరిస్థితి విషమించి రోగులు ఆసుపత్రిలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం, రోగుల సంఖ్య దాదాపు 100 వరకు ఉండగా ఇటీవల వైరల్ ఫీవర్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్ పేషెంట్లకు ఆరోగ్య సేవలు

గాంధీ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య 1700కు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో 2000కు చేరింది. గతంలో 300 మంది వ్యక్తులు హాజరైన ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు 800 మంది రోగులకు,ఔట్ పేషెంట్లకు ఆరోగ్య సేవలు అందిస్తుంది.

వైరస్ ప్రభావితమైన వారిలో, పిల్లలు మరియు దుర్బలత్వం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని వైద్యులు గట్టిగా చెప్పారు. ప్రభుత్వం అనేక పరిశుభ్రత చర్యలు పాటించినప్పటికీ ప్రజలని ఈ వైరల్ ఫివర్లు మహమ్మారిగా మారి అనారోగ్యానికి గురి చేస్తున్నాయి.

సాధారణంగా నవంబర్ నుండి అంటువ్యాధి సంబంధిత కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అదనంగా గాలి ద్వారా వ్యాపించే వైరస్ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు ఆందోళన కలిగిస్తూన్నాయని, మాస్క్‌లను ధరించాలని వైద్యులు నొక్కి చెప్తున్నారు.

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచనలు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు గత రెండు నెలలుగా డెంగ్యూ లక్షణాలతో కూడిన రోగులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతు వస్తుందని తెలిపారు. అదృష్టవశాత్తూ ఎటువంటి మరణాలు సంభవించలేదని అయన పేర్కొన్నారు.

జ్వరం, విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ రావు సూచిస్తున్నారు. డెంగ్యూ కేసులలో ప్లేట్‌లెట్ స్థాయి తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.

చివరకు సీఎం ని కూడా వదలని వైరల్ ఫీవర్

ఈ రుతుపవనాల సీజన్ తర్వాత అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి కాగా మురికి వాడలో ఉండే సామాన్యులకే కాదు,చాల జాగ్రత్తలు తీసుకునే తెలంగాణ CM KCR కు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే అతను సాధారణ స్థితికి చేరుకుంటాడని వైద్యులు చెబుతున్నారని ktr తెలిపారు.

వైరల్ ఫీవర్ (Viral fever) యొక్క లక్షణాలు

వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు వైరల్ infections రకాన్ని బట్టి మారె అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్లలో ఎక్కువ భాగానికి సంబంధించిన సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు.

  • తీవ్ర జ్వరం (103-104°F) 
  • తలనొప్పి (తేలికపాటి నుంచి తీవ్రమైన)
  • గొంతు నొప్పి
  • ముక్కు కారడం
  • కండరాల నొప్పి మరియు కీళ్ల నొప్పి
  • పొత్తికడుపు నొప్పి
  • వికారం,
  • వాంతులు
  • అలసట
  • కళ్లు తిరగడం
  • చలి
  • కళ్లు ఎర్రబారడం
  • ముఖం వాపు
  • చర్మంపై దద్దుర్లు
  • ఆకలి లేకపోవడం