Home   »  జీవన శైలి   »   ఈ ఫ్రూట్స్ తింటే బరువు తగ్గడం ఖాయం

ఈ ఫ్రూట్స్ తింటే బరువు తగ్గడం ఖాయం

schedule sirisha

Weight Loss Fruits | బరువు తగ్గాలనుకునే వారు సులభంగా బరువు తగ్గేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇటువంటి ఆహారాలలో పండ్లు మొదటివరుసలో ఉంటాయి. ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం.

Weight Loss Fruits

Weight Loss Fruits | బరువు తగ్గించే పండ్లు

ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. సులభంగా బరువు తగ్గాలంటే కొన్ని పండ్లు తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. సులభంగా బరువు తగ్గాలంటే కొన్ని పండ్లు తినడం చాలా ముఖ్యం. అలాంటి పండ్లు ఏమిటంటే దానిమ్మ, జామపండ్లు, పుచ్చకాయ, అరటిపండ్లు, ఆపిల్స్,

దానిమ్మ

బరువు తగ్గడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల డీటాక్సీఫికేషన్ అవుతుంది.వేగంగా బరువును తగ్గించగల శక్తి ఈ గింజల్లో ఉంది.ఇవి ఆకలిని నియంత్రిస్తాయి.

జామపండు

జామపండు చాలా ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి అని అందరికి తెలుసు. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఈ పండ్లలో 37 నుంచి 55 కేలరీలు మాత్రమే ఉంటాయి. అదనంగా వాటిలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా మనకు లభిస్తాయి. ఇవి తింటే పౌష్టికాహార లోపం తగ్గుతుంది.

పుచ్చకాయ

నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల హైడ్రేషన్ అందుతుంది, కడుపు నిండుతుంది. B.P, అధిక బరువును తగ్గిస్తుంది. కాలేయం సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు.

అరటిపండ్లు

అరటిపండులో సహజంగానే చక్కెర నిల్వలు ఉన్నాయి. ఇవి శక్తిని అందిస్తాయి. వాటిలో పొటాషియం మరియు విటమిన్-B6 ఉన్నాయి. 105 కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో 3 గ్రాముల ఫైబర్ మరియు సహజ చక్కెరలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా బరువును తగ్గించడంలో ఎంతో సహాయం చేస్తాయి.

ఆపిల్స్

యాపిల్స్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది తిన్నాక కడుపు నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్-C కూడా ఉన్నాయి.ఈ పండ్లలోని పాలీఫెనాల్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

Also read: నారింజ తొక్కతో లెక్కలేనన్ని ప్రయోజనాలు…