Home   »  వినోదం   »   చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్..

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్..

schedule ranjith

జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న అల్లు అర్జున్ తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. పుష్ప చిత్రంలో నటనకు గాను బన్నీని అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన రాగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తారక్ ఆలస్యం చేయకుండా బన్నీకి అవార్డు రావడంతో వెంటనే స్పందించాడు. బావా కంగ్రాట్స్ అన్నాడు.. తారక్. నిస్వార్థమైన విషెస్‌కు థాంక్స్ అని బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. చిరు,బన్నీ మీద ప్రేమను చాటుకున్నాడు. ఇలా అందరూ ట్వీట్లు వేస్తున్నారు. పుష్ప దర్శకుడు సుకుమార్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్ అర్ధాంగి స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.