Home   »  వినోదం   »   కల్కి..లీక్‌ అయిన ప్రభాస్‌ ఫొటోలు షేర్‌ చేయొద్దు

కల్కి..లీక్‌ అయిన ప్రభాస్‌ ఫొటోలు షేర్‌ చేయొద్దు

schedule raju

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా కల్కి 2898 . సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికి పైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే, ప్రభాస్‌కు చెందిన కొన్ని ఫొటోలు లీక్‌ అవ్వగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈక్రమంలో లీక్‌ అయిన ఫొటోలను వ్యాప్తి చేయొద్దని చిత్ర యూనిట్‌ నుంచి అభ్యర్థన వస్తోంది. షేర్‌ చేస్తే అకౌంట్‌ సస్పెండ్‌ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదంతా ‘సలార్‌’ వాయిదా టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకే అని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

అయితే సలార్ సంక్రాంతి బరిలోకి దిగితే మాత్రం కల్కి ప్లేస్‌లోకి రావడం గ్యారెంటీ.. అనే బజ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి కల్కి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశాడు నాగ్ అశ్విన్ కానీ ఈ సినిమా సమ్మర్‌కు పోస్ట్‌పోన్ కానుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. కాబట్టి.. కల్కి ప్లేస్‌లోకి సలార్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే సంక్రాంతి వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే గుంటూరు కారం, ఈగల్ వంటి సినిమాలు సంక్రాంతికి డేట్ లాక్ చేసుకున్నాయి. ఒకవేళ సలార్ గనుక కల్కి ప్లేస్‌లో వస్తే మాత్రం.. మిగతా సినిమాలు డైలమాలో పడినట్టే. మరి ప్రశాంత్ నీల్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.