Home   »  వినోదం   »   ‘జైలర్‌’ సినిమా ఆన్‌లైన్‌ లో లీక్… షాక్ లో మూవీ టీం.!

‘జైలర్‌’ సినిమా ఆన్‌లైన్‌ లో లీక్… షాక్ లో మూవీ టీం.!

schedule raju

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు ఆన్‌లైన్‌ సైట్లలో HD క్వాలిటీ సినిమా లీకైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ఓటీటీలో విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంపై షాక్‌ అవుతున్నారు.

ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్‘ ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల దిశగా పయనిస్తోంది. ఇంతలో ‘జైలర్’ హై-డెఫినిషన్ ప్రింట్ ఇంటర్నెట్‌లోకి లీక్‌ కావడంపై షాక్‌ అవుతున్నారు.

అయితే తలైవర్ ఫ్యాన్స్ మాత్రం ఆన్‌లైన్‌ లో లీక్ అవ్వడం కాదు ఓటీటీలో ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా కూడా మేము రజినీకాంత్ ని థియేటర్స్ లోనే చూస్తాం అంటూ జైలర్ యూనిట్ కి అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.. మరి ఈ లీకుని తట్టుకొని ‘జైలర్‌’ సినిమా ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనేది చూడాలి.