Home   »  జాతీయంవార్తలువినోదం   »   జైలర్‌ సినిమా కోసం ఉద్యోగులకు సెలవు

జైలర్‌ సినిమా కోసం ఉద్యోగులకు సెలవు

schedule raju

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినిమా వస్తోందంటే ఆ క్రేజే వేరు. జైలర్‌ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది, భారతదేశం అంతటా బాక్సాఫీస్ వద్ద బలమైన అంచనాలతో దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత రజనీకాంత్ బిగ్ స్క్రీన్‌పై విజయవంతగా తిరిగి వస్తున్నారు.

తాజాగా జైలర్‌ సినిమా విడుదల సందర్భంగా ‘యూనో ఆక్వా కేర్’ అనే కంపెనీ కూడా ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ బ్రాంచిల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా టికెట్లు కూడా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.