Home   »  వినోదం   »   Netflix | ఒకే OTTలో ‘జవాన్‌”, “మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ స్ట్రీమింగ్.!

Netflix | ఒకే OTTలో ‘జవాన్‌”, “మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ స్ట్రీమింగ్.!

schedule raju

Netflix: షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అట్లీ (Atlee Kumar) కాంబోలో తెరకెక్కిన ‘జవాన్‌’ సినిమా (Jawan) ఈరోజు రిలీజ్‌ అవ్వగా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

దీంతో పాటు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన “మిస్‌ శెట్టి మిస్టర్‌ పాలిశెట్టి’ మూవీకి సైతం మంచి రివ్యూస్‌ వస్తున్నాయి.

దీంతో ఈ 2 సినిమాల OTT రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాల OTT హక్కులను నెట్‌ప్లిక్స్‌ (Netflix) సొంతం చేసుకుంది. 4 వారాల తర్వాత స్టీమింగ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం.

‘జవాన్‌’ సినిమా

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా.. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) డైరెక్షన్ లో .. తెరకెక్కిన జవాన్ మూవీలో (Jawan).. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార షారుఖ్ జోడీగా నటించింది. ఇక అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈమూవీ యాక్షన్ లవర్స్ కు.. షారుఖ్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా దొరికిందంటూ సంబరపడిపోతున్నారు. 

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పాలిశెట్టి’ మూవీ

జాతీ రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క (Anushka Shetty) నటిస్తోంది. ఇక తన కంటే తక్కువ వయసు ఉన్న హీరోతో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో స్టాండ్ అప్ కమెడియన్ గా నవీన్ కనిపించగా.. అనుష్క 40 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని షెఫ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఇక ఈ మూవీ ఈరోజు రిలీజ్ కాగా.. మంచి టాక్ సొంతం చేసుకుంది.

OTTలో విడుదల

ఈమూవీ కోసం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + Hotstar) , నెట్ ప్లిక్స్ (Netflix) లు గట్టి పోటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

చివరకు ఈ సినిమా కూడా నెట్ ప్లిక్స్ (Netflix) లో రిలీజ్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నెట్ ప్లిక్స్ తో పాటు.. ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు ఈ సినిమా కి సంబందించిన రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 40 రోజులకు ఓటీటీలోకి రావొచ్చని అంటున్నారు.