Home   »  వినోదం   »   సలార్‌ సినిమా రిలీజ్‌ వాయిదా..? అసలేమైందంటే.!

సలార్‌ సినిమా రిలీజ్‌ వాయిదా..? అసలేమైందంటే.!

schedule raju

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా వాయిదా పడే అవకాశముందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవగా.. డిసెంబర్‌కు పోస్ట్‌పోన్‌ అయిందంటూ సినీ విశ్లేషకులు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు SEP-6న ట్రైలర్‌ రిలీజ్‌ అవుతుందని, కావాలనే పుకార్లు సృష్టించారని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్‌ స్పందించాల్సి ఉంది.

కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదని ..పోస్ట్ పోన్ మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందంటున్నారు. ట్రైలర్ రిలీజ్ లో ఏ మార్పు ఉండదని ఈ ట్రైలర్ ని 7 వ తేదీ షారూఖ్ `జవాన్` సినిమాతో కలపనున్నారని అంటున్నారు.  ఇంటర్వెల్ లో ఈ ట్రైలర్ వస్తుంది.

సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉన్నారట.. అంతేకాకుండా కొన్ని షాట్లు మళ్లీ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా అనుకున్న టైమ్ కు రావడం లేదట. ఇప్పటికే మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు నెమ్మదిగా చెప్పుకొస్తున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే సెప్టెంబర్ 28 న సలార్‌ సినిమా రావడం కష్టమని.. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.