Home   »  వినోదం   »   సలార్‌ తెలుగు రాష్ట్రాల ధియేటరికల్ హక్కులు… ఎంతో తెలుసా.?

సలార్‌ తెలుగు రాష్ట్రాల ధియేటరికల్ హక్కులు… ఎంతో తెలుసా.?

schedule raju

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్‌’ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటరికల్‌ హక్కులను మేకర్స్‌ భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. రూ.170 కోట్లకు ‘సలార్‌’ హక్కులను సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ ధియేటరికల్ హక్కులు పొందిన చిత్రంగా నిలిచింది. కెజిఎఫ్ సిరీస్ తో దేశాన్ని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ సలార్‌ చిత్ర దర్శకుడు కావడంతో హైప్ ఏర్పడింది. ఆయన గత చిత్రం కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి దర్శకుడు ప్రభాస్ వంటి మాస్ హీరోతో చేసే చిత్రం గొప్పగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ మొదలయ్యాయి.

సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. అలాగే ఇది కెజిఎఫ్ కథలో భాగమే అంటున్నారు. జగపతిబాబు కీలక రోల్ చేస్తుండగా… పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.