Home   »  వినోదం   »   “పుష్ప-2” నుంచి అప్డేట్ వచ్చింది

“పుష్ప-2” నుంచి అప్డేట్ వచ్చింది

schedule raju

సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పోలీసు అధికారి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా నటించిన ఫాహద్‌ ఫాసిల్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈరోజు ఫాహద్‌ బర్త్‌ డే కావడంతో… మేకర్స్‌ విషెస్‌ తెలియజేస్తూ పోస్టర్‌ను ట్వీట్‌ చేశారు. పుష్పసినిమాలో ఫాహద్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకోగా… ‘పుష్ప-2’ లో అల్లు అర్జున్‌, ఫాహద్‌ మధ్య జరిగే యాక్షన్‌ సీన్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక పుష్ప సినిమాలో మలయాళం స్టార్ ఫాహద్‌ ఫాసిల్‌ భన్వర్ సింగ్ షెకావత్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 1 సినిమా లాస్ట్ లో ఒక 20 నిముషాలు కనపడి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్‌ అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్ కూడా అల్లు అర్జున్, ఫాహద్‌ మధ్యే ఉంటుంది. దీంతో ఈ క్యారెక్టర్ కి బాగా పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ లో ఫాహద్‌ బన్నీపై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.