Home   »  జాతీయం   »   నాలుగు వేళ్లను అతికించడానికి 12 గంటలు శ్రమించిన వైద్యులు..

నాలుగు వేళ్లను అతికించడానికి 12 గంటలు శ్రమించిన వైద్యులు..

schedule ranjith

ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఓ మహిళ వేళ్లు మెషిన్ లో పడి తెగిపోయాయి. తిరిగి అతికించడానికి వైద్యులు 12 గంటలు శ్రమించి వేళ్లను అతికించారు.

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి ఈ ఘటన

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. పశువులకు మేత వెయ్యడానికి గడ్డిని కట్ చేసే యత్నంలో ఓ మహిళ నాలుగు వేళ్లు యంత్రంలో పడి తెగిపోయాయి. వీటిని తిరిగి అతికించడానికి వైద్యులకు 12 గంటల సమయం పట్టింది. కోలార్ సమీపంలోని వీరపురం గ్రామానికి చెందిన మంజుల (44) తన ఆవులకు మేత వేసేందుకు వీలుగా.. గడ్డిని మెషిన్ లో వేసి కట్ చేస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేయి మెషిన్ లో పడి నాలుగు వేళ్లు తెగిపోయాయి.

బెంగళూరులోని హస్మత్ హాస్పిటల్ లో అరుదైన సర్జరీ

వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెతో పటు తెగిన వేళ్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసిన అనంతరం బెంగళూరులోని హస్మత్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను హస్మత్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేసి మొత్తం మీద 12 గంటల సర్జరీలో ధమనులు, సిరలు, నాడులను అతికించి, విరిగిన వేలి ఎముకల మధ్య సర్జికల్ వైర్లతో అనుసంధానం చేసినట్టు హస్మత్ హాస్పిటల్ చైర్మన్ థామస్ డాక్టర్ చాందీ వెల్లడించారు.

నాలుగు నెలలకు తిరిగి సాధారణ పరిస్థితి

ఈ నెల ఆదివారం 1 న ఆమెకు సర్జరీ చేయగా, శుక్రవారం 6 న హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు. మూడు నుంచి నాలుగు నెలల్లో తెగిన వేళ్లతో సాధారణ పనులు చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. ఎప్పుడైనా వేళ్లు తెగిపోయినప్పుడు వెంటనే వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి, చుట్టూ ఐస్ క్యూబ్ లు వేసి, హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

Also Read: అక్టోబర్ వారంలో OTT లో విడుదల కానున్న సినిమాలు… వివరాలను తనిఖీ చేయండి.!