Home   »  జాతీయం   »   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా 10 వేలు…!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా 10 వేలు…!

schedule mahesh

రాజస్థాన్ : కాంగ్రెస్ పార్టీ (Congress party) కర్నాటకలో ఐదు గ్యారంటీలు సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దానికి కాస్త అటు ఇటుగా ఆ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా హామీలు వర్షం కురిపిస్తున్నాయి.

ఈ హామీలు కూడా కొత్తగా కనిపిస్తుండటంతో త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ (Congress party) మహిళలే టార్గెట్ గా మరో గ్యారెంటీ పథకాన్ని ప్రకటించటం జరిగింది.

మరోసారి Congress party ని గెలిపిస్తే మహిళలకు ఏటా 10 వేల రూపాయలు

రాజస్తాన్ లో మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహిళలకు ఏటా రూ.10 వేల రూపాయలను ఇస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. అలాగే ఈ పథకం విధివిధానాలను కూడా తెలిపారు. గృహలక్ష్మి గ్యారంటీ పథకం కింద దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ఏటా మహిళ కుటుంబ పెద్దకు విడతల వారీగా ఈ 10 వేలు ఇస్తామని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. దీంతో ఈ పథకం మహిళలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై చర్చ ప్రారంభమైంది.

గృహలక్ష్మి గ్యారంటీ పథకం

దీంతో పాటు మహిళలకు ఉపయోగపడే మరో పథకాన్ని కూడా అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు వంట గ్యాస్ సిలెండర్ ను రూ.500 లకే ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది.

500 లకే గ్యాస్ సిలెండర్: అశోక్ గెహ్లాట్

ఇప్పటికే కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలెండర్ రేట్లను తగ్గిస్తామనే హామీ ఇచ్చింది. ఇదే తరహా లో రాజస్తాన్ లోనూ ఈ హామీ ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా కేంద్రం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై రూ.300 వరకూ తగ్గించగా, రాజస్తాన్ లో ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగేలా కనిపిస్తుంది.

మరోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమాగా కనిపిస్తుండగా తొలిసారి సీఎం అభ్యర్ధి ప్రకటన లేకుండా బరిలోకి దిగిన బీజేపీ మాత్రం మోడీ ఛరిష్మాను నమ్ముకుని ముందుకెళ్తుంది.