Home   »  జాతీయం   »   మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు 174 నామినేషన్లు దాఖలు

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు 174 నామినేషన్లు దాఖలు

schedule mahesh

మిజోరం : నవంబర్ 7న మిజోరంలో 40 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది మహిళలతో కలిపి మొత్తం 174 మంది అభ్యర్థులు నామినేషన్లు (Nominations) దాఖలు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

Nominations ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23 వరకు గడువు

అంతే కాకుండా నామినేషన్ పత్రాల పరిశీలన నిర్వహించబడుతుందని మరియు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23 వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మిజోరం లో అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మరియు కాంగ్రెస్‌ల అభ్యర్థులందరూ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తం 40 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి అధికార పార్టీ: MNF

MNF మొత్తం 40 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో 25 మంది ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు. అయితే మిగతా 15మంది అభ్యర్థులను MNF నిలబెట్టింది. 23 మంది బీజేపీ అభ్యర్థులు, నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని, 27 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు సమర్పించారని అధికారులు వెల్లడించారు.

మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతుంది. క్రైస్తవులు అధికంగా ఉండే మిజోరం లోని రాజకీయ పార్టీలు, చర్చిలు, పౌర సమాజ సంస్థలు మరియు విద్యార్థి సంఘాలు క్రైస్తవులకు పవిత్రమైన రోజు ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని తిరిగి షెడ్యూల్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. రాష్ట్ర జనాభాలో క్రైస్తవులు 87 శాతం ఉన్నారు. ఈ పిటిషన్లపై ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు.