Home   »  జాతీయం   »   పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం

schedule ranjith
Adulterated liquor 21 people died after drinking adulterated liquor in Punjab

Adulterated liquor | పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్రూర్‌ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. కల్తీ మద్యం సేవించి పదుల సంఖ్యలో ఆసుపత్రులలో చేరుతున్నారు. వారిలో ఇప్పటి వరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ మద్యం సేవించి కనీసం 40 మంది ఆస్పత్రిలో చేరారు. అందులో 20వ తేదీ, బుధవారం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Adulterated liquor | కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 21

ఆ మరుసటి రోజు గురువారం నాడు పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. శుక్రవారం మరో 8 మంది, శనివారం 5గురు చనిపోయారు. దీంతో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి పెరిగినట్లు సంగ్రూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

Also Read | Kamalapur News | మద్యం, మాంసాహార దుకాణాల స్వచ్చంద బంద్‌