Home   »  జాతీయం   »   3డీ-ప్రింటెడ్‌ పోస్టాఫీస్‌ ప్రారంభం… తొలిసారిగా భారతదేశంలో.!

3డీ-ప్రింటెడ్‌ పోస్టాఫీస్‌ ప్రారంభం… తొలిసారిగా భారతదేశంలో.!

schedule raju

దేశంలో తొలి అల్సూర్‌ బజార్‌ 3డీ-ప్రింటెడ్‌ పోస్టాఫీసు భవనాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ బెంగళూరులో ప్రారంభించారు. మార్చి 21 ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించగా…కేవలం 44 రోజుల్లో సిద్ధం చేశారు.

బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్‌వాసులకు సేవలు అందించనుంది. అయితే డ్రైనేజీ, నీటి సరఫరా డిజైనింగ్‌ ఆలస్యంతో పాటు మం త్రి అందుబాటులో లేకపోవడంతో భవన ప్రారంభం వాయిదా పడింది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ & టూబ్రో నిర్మించింది.

ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తపాలా శాఖ వారికి అత్యంత అవసరమైన ప్రాంతాలలో పోస్టాఫీసు భవనాలను అందించడానికి సాధ్యమయ్యే ప్రత్యామ్నాయాన్ని అందించవచ్చు. ఇంతకు ముందు, 600 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారతదేశపు మొట్టమొదటి 3డీ-ప్రింటెడ్‌ ఇల్లు IIT-మద్రాస్ క్యాంపస్‌లో నిర్మించబడింది.