Home   »  జాతీయం   »   రోవర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం….

రోవర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం….

schedule sirisha

చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకొచ్చి చంద్రుడి పై పరిశోధనల కోసం చక్కర్లు కొడుతున్న రోవర్‌కు నిన్న తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో దాదాపు నాలుగు మీటర్ల వెడల్పైన బిలాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో వెనక్కి రావాలని రోవర్‌కు కీలక ఆదేశాలు అందించి దాని మార్గాన్ని మళ్లించింది. ప్రస్తుతం రోవర్‌ సురక్షితమైన మార్గంలో వెళ్తుందని ISRO ట్వీట్‌ చేసింది.