Home   »  జాతీయం   »   ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జూ సంరక్షకుడు

ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జూ సంరక్షకుడు

schedule mahesh

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూ పార్క్ లో ఎలుగుబంటి దాడి (bear attack) ఘటనలో ఓ జూ సంరక్షకుడు మరణించాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న బాణాపురపు నగేష్‌(23) గా పేర్కొన్నారు.

bear attack

జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా bear attack

నగేష్ యధావిధిగా సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లో ఉందని భావించి ఆ ఉద్యోగి క్లీనింగ్‌లో నిమగ్నమయ్యాడు. ఈ ఒక్కసారిగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. వాస్తవానికి ఎలుగుబంటి బోను తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి నగేష్ దానిపై దాడికి
చేయడానికి ప్రయత్నించాడు. తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది.

ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నరేష్

ఆ ఎలుగుబంటి అతడిపై తీవ్రంగా దాడి చేయగా ప్రాణాలు కోల్పోయాడు. జూలో సందర్శకులు చూస్తుండగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసిన సందర్శకులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగేష్‌ గత రెండేళ్లుగా జూలో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుని కుటుంబానికి జూ అధికారులు రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

Also Read: ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఐదుగురు గల్లంతు, 6 గురు మృతి