Home   »  జాతీయం   »   రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆప్ అభ్యర్థులు

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆప్ అభ్యర్థులు

schedule mahesh

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP candidates) చెందిన సభ్యులు సంజయ్ సింగ్, స్వాతి మలివాల్, ఎన్డీ గుప్తాలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వీరికి ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందించారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియబోతుంది.

aap-candidates-who-were-unanimously-elected-to

ఏకగ్రీవంగా ఎన్నికైన AAP candidates

ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు రెండోసారి సంజయ్ సింగ్, ND గుప్తాలను రాజ్యసభకు పంపుతుంది. మరో నేత సుశీల్ గుప్తా స్థానంలో DCW మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను ‘ఆప్’ రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది.

ఆప్ నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఆ ముగ్గురు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. నామినేషన్ల గడువు జనవరి 9, నామినేషన్ల పరిశీలన జనవరి 10తో ముగుస్తుంది. అభ్యర్థుల నామినేషన్ గడువు జనవరి 12తో ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Also Read: సముద్ర వంతెన “అటల్ సేతు” ను ప్రారంభించిన ప్రధాని మోదీ