Home   »  జాతీయం   »   ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరిన AAP

ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరిన AAP

schedule mahesh

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న, మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్‌లో అతి పెద్ద పండుగ అయిన ఛత్ పూజ

ఛత్తీస్‌గఢ్‌లో అతి పెద్ద పండుగ అయిన ఛత్ పూజ నవంబర్ 17, 18 మరియు 19 తేదీలలో వస్తుంది. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లకు పరిమితం అవుతారు. ఫలితంగా ఓటింగ్‌లో పాల్గొనడం తగ్గుతుందని ఛత్తీస్‌గఢ్ ఆప్ (AAP) ఇన్‌ఛార్జ్ సంజీవ్ ఝా మీడియా తో మాట్లాడుతూ అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు పోలింగ్ తేదీలను మార్చాలని డిమాండ్

పోలింగ్ తేదీలను ప్రకటించిన మరుసటి రోజే మేము ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశాము. పోలింగ్ తేదీలను మార్చాలని, తద్వారా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు కూడా పోలింగ్ తేదీలను మార్చాలని డిమాండ్ చేశాయని ఝా వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌(AAP) అభ్యర్థుల మూడో జాబితాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను ఆప్‌ (AAP) గురువారం ప్రకటించింది. 11 మంది అభ్యర్థులలో, బైకుంత్‌పూర్ అసెంబ్లీ నుండి డాక్టర్ ఆకాష్ జశ్వాల్, కట్ఘోరా నుండి చంద్రకాంత్ దీక్షేనా, లోర్మీ నుండి మన్భజన్ టాండన్, ముంగేలి నుండి దీపక్ పాత్రే, జైపూర్ నుండి దుర్గాలాల్ కేవత్ , కస్డోల్ నుండి లెఖ్ రామ్ సాహు, జశ్వంత్ సిన్హా నుండి పార్టీ పోటీ లో నిలిపింది.

గుండర్‌దేహి, దుర్గ్ గ్రామీణ్ నుంచి సంజీత్ విశ్వకర్మ, పండరియా నుంచి చమేలీ కుర్రే, బస్తర్ నుంచి జగ్‌మోహన్ బఘేల్, జగదల్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి నరేంద్ర భవాని నిలిచారు. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.