Home   »  జాతీయం   »   AAP ఎమ్మెల్యే అరెస్ట్.. బహిరంగ సభ మధ్యలో నుంచి తీసుకెళ్లిన ED

AAP ఎమ్మెల్యే అరెస్ట్.. బహిరంగ సభ మధ్యలో నుంచి తీసుకెళ్లిన ED

schedule raju

చండీగఢ్: పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా (Jaswant Singh Gajjan Majra) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం అరెస్టు (AAP MLA Arrested) చేసింది. ఈ ఉదయం మలేర్‌కోట్ల జిల్లా అమర్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. అక్కడికి వచ్చిన ED అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అతడిని మొహాలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ED వర్గాలు వెల్లడించాయి.

AAP MLA Arrested – మనీలాండరింగ్ కేసు నమోదు

లూథియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గత ఏడాది జశ్వంత్ సింగ్‌కు చెందిన కంపెనీపై ఫిర్యాదు చేసింది. తమ బ్యాంకును జశ్వంత్ సింగ్‌కు చెందిన కంపెనీ రూ. 41 కోట్ల మేర మోసం చేసిందని బ్యాంకు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన CBI గత ఏడాది సెప్టెంబర్‌లో జశ్వంత్ నివాసం, పాఠశాల, కార్యాలయాలు, అతని కుటుంబం నడుపుతున్న ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల ఆధారంగా ED మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.

తాజాగా ఈ కేసులో విచారణ నిమిత్తం జశ్వంత్‌కు ED నాలుగు సార్లు సమన్లు ​​జారీ చేసింది. అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఇటీవలే అదుపులోకి తీసుకున్నట్లు ED వర్గాలు వెల్లడించాయి. అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మల్వీందర్ కాంగ్ తీవ్రంగా ఖండించారు. బహిరంగ సభ నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఇద్దరు అభ్యర్థులతో 5వ జాబితాను విడుదల చేసిన AAP