Home   »  జాతీయం   »   Sanjay Singh |మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్ట్‌

Sanjay Singh |మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్ట్‌

schedule mahesh

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంబంధం ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరిపారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోర

ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోర తో సంజయ్ కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎంపీ నివాసంలో సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరెస్టైన కీలక నేతల్లో సంజయ్ సింగ్ మూడో నేత కావడం విశేషం. గతంలో నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేందర్ జైన్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడైన అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసారు.

సంజయ్ సింగ్ అరెస్ట్ పై మండి పడ్డ ఆప్ నేతలు (Sanjay Singh)

సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేయడంపై ఆప్ నేతలు తీవ్రస్థాయిలో కేంద్రంపై మండి పడుతున్నారు. తాజాగా సంజయ్ సింగ్ తండ్రి, అతని భార్య ఇతర కుటుంబసభ్యులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిసి సంజయ్ అరెస్ట్ ని ఖండించారు.

ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే సంజయ్‌ సింగ్‌ అరెస్టు

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే సంజయ్‌ సింగ్‌ను అరెస్టు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణంలో ఆప్‌కు లబ్ధి చేకూరినట్లు ఆరోపణలున్నప్పుడు ఆ పార్టీని ముద్దాయిగా ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు బుధవారం ఈడీని ప్రశ్నించింది.