Home   »  జాతీయం   »   సంజయ్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా AAP పార్టీ నిరసనలు

సంజయ్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా AAP పార్టీ నిరసనలు

schedule mahesh

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP party) ఎంపి సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం నిరసన చేపట్టారు.

నవంబర్ 10 వరకు పొడగించిన సింగ్‌ జ్యుడీషియల్ కస్టడీ

గతంలో కోర్టు మంజూరు చేసిన 14 రోజుల కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి M. K. నాగ్‌పాల్ ముందు హాజరుపరిచారు. కోర్టు సింగ్‌కు జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 10 వరకు పొడగించటం జరిగింది.

సంజయ్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా బిజెపి ప్రధాన కార్యాలయం దగ్గర ఆప్ పార్టీ (AAP party) నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీకి, మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నిరసనకారులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

బీజేపీకి, మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా AAP నిరసనలు

ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా ఆప్ కార్యకర్తలు “జబ్ జబ్ మోడీ దర్తా హై – ఇడి కో ఆగే కర్తా హై, మోడీ జీ కి తనషాహీ నహీ చలేగీ, ‘సంజయ్ సింగ్ కో రిహా కరో,’ బిజెపి ముర్దాబాద్, ఇడి-సిబిఐ ముర్దాబాద్ వంటి నినాదాలు చేసారు.

నిరసనను మొదట బిజెపి ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని భావించారు. కాని ఢిల్లీ పోలీసులు రోడ్లను అడ్డుకున్నారు. AAP యొక్క రాజ్యసభ ఎంపీ మరియు సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. మరియు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు విద్య, ఆరోగ్య సమస్యల వంటి సవాళ్లను ఎత్తిచూపారు.

ఓటమి భయంతోనే ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందన్న AAP party

ఆప్ పార్టీ మార్పు తీసుకురావడానికి పార్టీ కట్టుబడి ఉందని, బిజెపి ప్రభుత్వం తమ నాయకులను తప్పుగా ఇరికించిందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. న్యాయ వ్యవస్థ పట్ల పార్టీ అంకితభావాన్ని, సింగ్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు.

ప్రభుత్వం తమ నేతలను తప్పుగా ఇరికించడం కొనసాగించినంత కాలం పోరాటం కొనసాగుతుందని మరో ఆప్ ఎమ్మెల్యే రితురాజ్ ఝా తెలిపారు. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తోందని, సత్యం, నిజాయితీ గెలుస్తుందని ఆప్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కులదీప్ కుమార్ పేర్కొన్నారు.